Monday, December 23, 2024

పాముతో ప్రేమలో పడిన ఆవు (వీడియో వైరల్)

- Advertisement -
- Advertisement -

న్యూస్ డెస్క్: చెడు వ్యక్తులతో స్నేహం చేస్తున్నప్పుడు పామును పక్కలో పెట్టుకున్నట్టు ఉంటుందని అని పెద్దలు చెబుతుంటారు. చెడు స్నేహం అనేది పాములతో పోల్చి పెద్దలు చెబుతారు. కానీ నాగుపాము, ఆవుకు మధ్య మంచి స్నేహం కలిగింది. పాము పడగ విప్పగానే పడగపై ఆవు నాలుకతో నెమురుతూ కనిపిస్తుంది. పాము కూడా ఆవుకు తగిన విధంగా ప్రేమగా స్పందిస్తూ ఉంటుంది. దీనికి సంబందించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ వీడియోను సుశాంత్ నందా అనే వ్యక్తి ట్విట్టర్ లో ట్వీట్ చేశారు. 6.7 లక్షల మంది వీక్షించగా పది వేల మంది లైక్ చేశారు. పకృతిలో నిజమైన స్నేహం అని సందిప్తా పట్నాయక్ అనే నెటిజన్ తెలిపారు. పాము పెంపుడు జంతువు అని ఆవు భ్రమ పడుతుందని మరో నెటిజన్ కామెంట్ పెట్టాడు. పాము, ఆవు ప్రేమలో పడ్డాయని కిషన్ ప్రభు అనే వ్యక్తి కామెంట్ పెట్టాడు. రెండు జంతువుల ప్రేమ నుంచి మానవులు చాలా నేర్చుకోవాలని అనిల్ కుమార్ అనే నెటిజన్ కామెంట్ పెట్టాడు. ఓ దేవుడా నేను అసలు అనుకోలేదు ఆ రెండు అంతా ప్రేమగా ఉంటాయని నేహా బిశ్వాల్ కామెంట్ పెట్టారు. శివుడి దయతోనే రెండు జంతువుల మధ్య ప్రేమ కలిగిందని నాబా కుమార్ డేకా తెలిపారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News