Monday, December 23, 2024

యుపిలో గోవుల స్మగ్లర్ అరెస్ట్

- Advertisement -
- Advertisement -

సోనుభద్ర( యుపి ): గత కొన్నాళ్లుగా పోలీస్‌లకు దొరక్కుండా తప్పించుకు తిరుగుతున్న గోవుల స్మగ్లర్‌ను ఎదురెదురు కాల్పుల తరువాత పోలీస్‌లు అరెస్ట్ చేయగలిగారు. ఉత్తరప్రదేశ్ లోని రాజ్‌ఖర్ వ్యాలీ ఏరియాలో ఆదివారం ఈ అరెస్ట్ జరిగింది. గోవుల స్మగ్లర్ మిల్లట్ అన్సారీ ఆచూకీ తెలియజేస్తే రూ. 15 వేలు నగదు బహుమతి కూడా ఇస్తామని పోలీస్‌లు గతంలో ప్రకటించారు. ఆదివారం ఉదయం ఇద్దరు మోటార్ సైకిల్‌పై వస్తూ పోలీస్‌లు సోదా చేయడాన్ని గమనించి వెనక్కు తిరిగి పారిపోడానికి ప్రయత్నించారని,

వారిని పట్టుకోడానికి పోలీస్‌లు వెంబడించగా నిందితుడు పోలీస్‌లపై కాల్పులు ప్రారంభించాడని ఎస్‌పి యష్వీర్ సింగ్ చెప్పారు. పోలీస్‌లు వారిపై ఎదురు కాల్పులు జరపగా నిందితుడు అన్సారీ గాయపడి తరువాత అరెస్ట్ అయ్యాడని తెలిపారు. అన్సారీతో వచ్చిన మరో వ్యక్తి పారిపోయాడని చెప్పారు. ఝార్ఖండ్ లోని గర్హా జిల్లాకు చెందిన అన్సారీ ఉత్తరప్రదేశ్, ఝార్ఖండ్ పోలీస్‌లకు వాంటెడ్‌గా ఉన్నాడు. అన్సారీ మోటార్ సైకిల్, తూటాలు, నాటు తుపాకీలను స్వాధీనం చేసుకున్నామని చెప్పారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News