Friday, December 20, 2024

గోమూత్రం తాగండి బుద్ధి వస్తుంది: బిజెపి నేతలకు సలహా

- Advertisement -
- Advertisement -

 

నాగపూర్: కాంగ్రెస్‌తో చేతులు కలిపినందుకు తనను విమర్శిస్తున్న బిజెపిపై మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి, శివసేన(ఉద్ధవ్ థాక్రే వర్గం) అధ్యక్షుడు ఉద్ధవ్ థాక్రే ధ్వజమెత్తారు. ఆదివారం నాగపూర్‌లో ఒక బహిరంగసభలో ఆయన ప్రసంగిస్తూ హిందూత్వమంటే దేశం కోసం ప్రాణత్యాగం చేయడమని, కాని బిజెపి దృష్టిలో హిందూత్వమంటే గోమూత్రసేవనమని ఎద్దేవా చేశారు.

బిజెపిని గోమూత్రధారి హిందూత్వగా ఆయన అభివర్ణిస్తూ ఒకపక్క హుమాన్ చాలీసా పఠిస్తూ మరోపక్క మసీదుల్లోకి వెళ్లి ఖవ్వాలీ పాడతారని, ఇదేమి హిందూత్వమని ప్రశ్నించారు. ఉత్తర్ ప్రదేశ్‌కు వెళ్లి ఉర్దూలో మన్ కీ బాత్ మాట్లాడతారని, ఇదేమి హిందూత్వమని ఆయన అన్నారు. తాను కాంగ్రెస్‌తో చేతులు కలిపినందుకు తాను హిందూత్వను వదులుకున్నానంటూ బిజెపి ఆరోపిస్తోందని, కాంగ్రెస్‌లో హిందువులే లేరా అని ఆయన ప్రశ్నించారు.

Also Read: ప్రయాణికుడి వీరంగం..బయల్దేరిన చోటికే తిరిగొచ్చిన విమానం

సంభాజీనగర్‌లో ఏప్రిల్ 3న మహా వికాస్ అఘాడి బహిరంగ సభ అనంతరం సభా ప్రాంగణాన్ని బిజెపి కార్యకర్తలు గోమూత్రంతో శుద్ధి చేసినట్లు వచ్చిన వార్తలను ఆయన ప్రస్తావిస్తూ గోమూత్రాన్ని చల్లడం కాదు..దాన్ని వాళ్లు తాగుంటే కనీసం బుద్ధయినా వచ్చి ఉండేది అంటూ ధాక్రే మండిపడ్డారు.

కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం గౌతమ్ అదానీ కొమ్ముకాయడాన్ని ప్రస్తావిస్తూ దేశంలో ప్రజాస్వామిక విలువలను మోడీ ప్రభుత్వం చంపేస్తోందని ఆయన ఆరోపించారు. కేవలం తన సన్నిహితులను కాపాడుకోవడానికే ఆ పార్టీ ప్రజాస్వామ్యాన్ని వాడుకుంటోందని ఆయన అన్నారు. మోడీ ప్రభుత్వ వ్యవహార శైలిని ప్రశ్నించినందుకే కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ లోక్‌సభ సభ్యత్వాన్ని రద్దు చేశారని, మోడీని అవినీతిని ప్రశ్నించినందుకు ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌ను అరెస్టు చేయడానికి సన్నాహాలు చేస్తున్నారని థాక్రే ఆరోపించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News