Monday, December 23, 2024

కొవిన్ డేటా లీకేజిపై ఎంపి డెరిక్ కేసు దాఖలు

- Advertisement -
- Advertisement -

కోల్‌కతా : కొవిన్ పోర్టల్‌లో నిక్షిప్తమై ఉన్న డేటా లీక్ కావడంపై తృణమూల్ కాంగ్రెస్ ఎంపి డెరెక్ ఒబ్రెయిన్ కేసు దాఖలు చేశారు. కోల్‌కతా లోని లాల్‌బజార్ సైబర్ పోలీస్ స్టేషన్‌లో ఈమేరకు ఫిర్యాదు చేశారు. ఇది చాలా లోతైన కుట్రగా ఆయన ఆరోపించారు. అత్యున్నతస్థాయి అధికారులు, ఇతర ప్రముఖులు దీని వెనుక ఉన్నారని ఆరోపించారు. వివిధ ప్రభుత్వ సంస్థల విభాగాలకు ఇది ప్రత్యక్ష బెదిరింపును సూచిస్తోందని వ్యాఖ్యానించారు. ఈ విధంగా వ్యక్తిగత సమాచారం ప్రైవేట్ సంస్థలు చోరీపాలు కావడంపై దర్యాప్తు తక్షణం అవసరమని ఆయన డిమాండ్ చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News