- Advertisement -
హైదరాబాద్: సికింద్రాబాద్ లోని సిందికాలనీలో కుటుంబంతో కలిసి నివాసముంటున్న వ్యాపారి రాహుల్ గోయల్ ఇంట్లో జరిగిన చోరీ కేసును పోలీసులు ఛేదించారు. ఈ చోరీకి పాల్పడిన నెపాల్‌కు చెందిన 10మందిని అరెస్టు చేసి వారి నుంచి రూ.5కోట్ల విలువైన బంగారు ఆభరణాలు, నగదును స్వాధీనం చేసుకున్నారు. ఈ సందర్భంగా సిపి ఆనంద్ మీడియా సమావేశం నిర్వహించి వివరాలు వెల్లడించారు.
“ఈ నెల 9వ తేదీన రాహుల్ గోయల్ ఇంట్లో చోరి జరిగింది. రూ.5కోట్ల విలువైన బంగారు ఆభరణాలు, నగదు దొంగలించారు. రాహుల్ ఇంట్లో ఐదేళ్లుగా వాచ్‌మెన్‌గా ఉన్న కమల్ ఈ చోరీకి పాల్పడ్డాడు. ఈ చోరీలో సంబంధమున్న వారిలో 10మందిని అరెస్టు చేశాం. మరో ముగ్గురు నిందితులు పరారీలో ఉన్నారు. త్వరలోనే వారిని కూడా పట్టుకుంటాం” అని సిపి ఆనంద్ తెలిపారు.
- Advertisement -