బంజారాహిల్స్‌లో సిసిటివిలు ప్రారంభించిన నగర సిపి అంజనీకుమార్
హైదరాబాద్: కేసుల దర్యాప్తులో సిసిటివిల పాత్ర కీలకమని నగర పోలీస్ కమిషనర్ అంజనీకుమార్ అన్నారు. నగరంలోని బంజారాహిల్స్‌లోని వెంకటేశ్వర కోఆపరేటివ్ హౌసింగ్ సొసైటీలో ఏర్పాటు చేసిన సిసి కెమెరాలను బుధవారం సిపి అంజనీకుమార్, జాయింట్ సిపి ఎఆర్ శ్రీనివాస్ ప్రారంభించారు. కాలనీలో 125 సిసిటివిలను ఏర్పాటు చేయడం అభినందనీయమని అన్నారు. దేశంలో భద్రత చాలా ముఖ్యమని, ప్రతి ఒక్కరూ తమ ఇంటి ముందు సిసి కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని కోరారు. ప్రజలను భాగస్వామ్యం చేయడంతో నగరంలో శాంతిభద్రతలు అదుపులో ఉన్నాయని అన్నారు. నగరంలోని ప్రతి సొసైటీలో సిసి కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని అన్నారు. హైదరాబాద్‌లో శాంతిభద్రతలు అదుపులో ఉండడంతో చాలా కంపెనీలు పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వస్తున్నాయని తెలిపారు. కాలనీల ప్రతినిధులు సిసి కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని కోరారు. కార్యక్రమంలో కాలనీ ప్రతినిధులు, పోలీసులు పాల్గొన్నారు.
CP Anjani Kumar started CCTV Control Room in Banjara Hills