Wednesday, January 22, 2025

పాతబస్తీలో పర్యటించిన నగర సిపి సివి ఆనంద్

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: పాతబస్తీలో ఏర్పాటు చేసిన గణేష్ మండపాలను హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సివి ఆనంద్ గురువారం రాత్రి పరిశీలించారు. పాతబస్తీలో ఏర్పాటు చేసిన గణేష్ మండపాలను పరిశీలించి ఏర్పాటు చేసిన వారిని వివరాలు అడిగి తెలుసుకున్నారు. గణేష్ విగ్రహాల తయారీ, నిమజ్జనం సందర్భంగా వచ్చే వారి సంఖ్య, తీసుకోవాల్సిన జాగ్రత్తలు గురించి తెలుసుకున్నారు. వినాయకుడి విగ్రహాల నిమజ్జనం గురించి మండపాల నిర్వాహకులను అడిగి తెలుసుకున్నారు, హుస్సేన్ సాగర్‌లో నిమజ్జనం చేసే వారు ముందుగా బయలు దేరాలని కోరారు. హుస్సేనీ ఆలం, కామాటిపుర, మొఘల్‌పుర తదితర ప్రాంతాల్లో పర్యటించారు. సిపి వెంట డిసిపి సాయిచైతన్య, పోలీస్ అధికారులు ఉన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News