- Advertisement -
హైదరాబాద్ : కరోనా వచ్చిన రెండేళ్ల తర్వాత భారత ఎయిర్ సిస్టం గాడిలో పడిందని హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సివి ఆనంద్ అన్నారు. మినిస్ట్రీ ఆఫ్ సివిల్ ఏవియేషన్, ఫిక్కీ ఆధ్వర్యంలో బేగంపేటలో ఏర్పాటు చేసి వింగ్స్ ఇండియా 2022 ఎయిర్ షోను హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సివి ఆనంద్ శనివారం సందర్శించారు. అక్కడ ఉన్న కాక్‌పీట్ సిమ్యులేటర్‌లో పైలటింగ్ ఎక్స్‌పీరియన్స్‌ను తెలుసుకున్నాడు. స్థానికంగా తయారవుతున్న ఎయిర్ క్రాఫ్ట్ గురించి అడిగి తెలుసుకున్నారు. అక్కడికి సందర్శనకు వచ్చిన వారితో మాట్లాడారు. నార్త్‌జోన్ పోలీసులు ఎయిర్ షోకు విస్కృతమైనన భద్రతను ఏర్పాటు చేశారని తెలిపారు. సిపి వెంట నార్త్‌జోన్ డిసిపి చందనదీప్తి, పోలీస్ అధికారులు ఉన్నారు.
- Advertisement -