- Advertisement -
స్పా సెంటర్లు, వ్యభిచార గృహాల యువతులతో కానిస్టేబుళ్లు రాసలీలు సంచలనంగా మారింది. రాసలీలలతోపాటు వారి నుంచి నెలవారీ మామూళ్లు వసూలు చేస్తున్న ముగ్గురు కానిస్టేబుళ్లను సీపీ కొత్తకోట శ్రీనివాస్ రెడ్డి సస్పెండ్ చేశారు. మధురానగర్ పీఎస్‌కు చెందిన ముగ్గురు కానిస్టేబుళ్లు.. పోలీస్ స్టేషన్ పరిధిలోని పలు స్పా సెంటర్లు, వ్యభిచార గృహాలనుండి నెలవారీ మామూళ్లు వసూలు చేస్తున్నట్లు ఆరోపణలు వచ్చాయి.
అంతేకాదు, యువతులతో రాసలీలకు పాల్పడుతున్నారని ఫిర్యాదులు కూడా రావడంతో ఉన్నతాధికారులు విచారణ జరిపారు. స్పా సెంటర్లలోకి ముగ్గురు కానిసేబుళ్లు, ఓ హోంగార్డ్ వెళ్లొచ్చిన దృశ్యాలు సీసీ కెమెరాల్లో రికార్డ్ కావడంతో ఆరోపణలు నిజమేనని తేలింది. దీంతో ముగ్గురు కానిస్టేబుళ్లపై సీపీ వేటు వేశారు.
- Advertisement -