Monday, December 23, 2024

పెద్ద గోల్స్ పెట్టుకుని సాధించాలి…

- Advertisement -
- Advertisement -

CP Mahesh Bhagwat launches police free training

కష్టపడి చదివి ఉద్యోగం కొట్టాలి
పోలీస్ ఉచిత శిక్షణను ప్రారంభించిన రాచకొండ సిపి మహేష్ భగవత్

హైదరాబాద్: పెద్ద గోల్స్ పెట్టుకుని,కష్టపడి చదివి వాటిని సాధించాలని రాచకొండ పోలీస్ కమిషనర్ మహేష్ భగవత్ అన్నారు. పోలీసు ఉద్యోగాలకు పోటీ పడుతున్న అభ్యర్థుల ఉచిత శిక్షణ కార్యక్రమాన్ని బుధవారం ఆయన ప్రారంభించారు. పోలీసు ఉదోగ్యాలకు పోటీ పడుతున్న అభ్యర్థులకు మోడల్ మార్కెట్ చంపాపేట్, అరోరా ఇంజనీరింగ్ కాలేజీ ఘట్‌కేసర్‌లో శిక్షణ ఇవ్వనున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నిరుద్యోగులు ప్రభుత్వ ఉద్యోగాల ప్రకటనను ఉపయోగించుకొని ప్రభుత్వ ఉద్యోగులుగా మారాలని అన్నారు. పోలీస్ నియామకాల్లో దాదాపుగా 2,000మంది అభ్యర్థులు శిక్షణ తీసుకోనున్నట్లు తెలిపారు. రాచకొండ పోలీసులు అభ్యర్థులకు అన్ని విధాల సహకరిస్తారని తెలిపారు. ప్రతి ఏడాది నిర్వహిస్తున్న పోలీస్ నియామకాల్లో పోటీపడుతున్న అభ్యర్థుల సంఖ్య పెరుగుతోందని అన్నారు.

యువత పోలీస్ ఉద్యోగాల్లో చేరేందుకు ఆసక్తి చూపుతున్నారని తెలిపారు. ఇప్పటి వరకు రాచకొండ పోలీసులు ఇచ్చిన ఉచిత శిక్షణలో 600మంది పోలీస్ ఉద్యోగాలు పొందారని తెలిపారు. ఇందులో కానిస్టేబుళ్లు, ఎస్సై ఉద్యోగాలు పొందిన వారు ఉన్నారు. ఉచిత శిక్షణ చాలా ఉన్నతమైనదని, ఇది చాలామంది పేద అభ్యర్థులకు సహకరిస్తుందని తెలిపారు. పేద అభ్యర్థులు ప్రైవేట్ కోచింగ్ సెంటర్లలో ఫీజులు కట్టలేక గతంలో ఇబ్బందులు పడేవారని తెలిపారు. ఉచితంగా శిక్షణ ఇస్తున్నామని, కానీ లెక్చరర్లకు తాము డబ్బులు చెల్లిస్తున్నామని తెలిపారు. పోలీసు ఉద్యోగాల అభ్యర్థుల శిక్షణకు విరాళాలు ఇచ్చేందుకు ముందుకు వచ్చిన వారికి కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో డిసిపి రక్షితమూర్తి, ఎడిసిపిలు షమీర్, శివకుమార్, లక్ష్మినారాయణ, ఎసిపిలు శ్రీధర్ రెడ్డి, నాగర్ శ్రీనివాస్, ఐటి సెల్ ఇన్స్‌స్పెక్టర్ శ్రీధర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News