Thursday, January 23, 2025

అథ్లెటిక్స్‌లో రాణిస్తున్న హెడ్‌కానిస్టేబుల్

- Advertisement -
- Advertisement -

అథ్లెటిక్స్‌లో రాణిస్తున్న హెడ్‌కానిస్టేబుల్
అభినందించిన రాచకొండ సిపి డిఎస్ చౌహాన్

హైదరాబాద్: మాస్టర్ గేమ్స్‌లో రాణిస్తున్న భువనగిరి ఎఆర్ హెడ్‌కానిస్టేబుల్ అంబోజు అనిల్‌కుమార్‌ను రాచకొండ పోలీస్ కమిషనర్ డిఎస్ చౌహాన్‌ను అభినందించారు. భువనగిరిలో ఎఆర్ హెడ్‌కానిస్టేబుల్‌గా పనిచేస్తున్న అంబోజు అనిల్‌కుమార్ అథ్లెటిక్స్‌లో రాణిస్తున్నాడు. ఈ నెల 12వ తేదీ నుంచి 20వ తేదీ వరకు దక్షిణ కొరియాలో జరగనున్న ఆసియా పసిఫిక్ మాస్టర్ గేమ్స్‌లో అథ్లెటిక్స్ 800 మీటర్లు, 1,500 మీటర్ల పరుగులో పాల్గొనడానికి అనిల్‌కుమార్ అర్హత సాధించారు.

ఈ మేరకు అనిల్‌కుమార్ రాచకొండ పోలీస్ కమిషనర్ డిఎస్ చౌహాన్‌ను మంగళవారం కలిశారు. అనిల్‌ను అభినందించిన సిపి డిఎస్ చౌహాన్ భవిష్యత్తులో మరిన్ని పతకాలు సాధించాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో యాదాద్రి డిసిపి రాజేష్ చంద్ర, సిఎఆర్ డిసిపి హనోక్ జయకుమార్, ఇన్స్‌స్పెక్టర్ శ్రీకాంత్ పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News