తెలంగాణ రాష్ట్ర నూతన గవర్నర్ గా సి.వి రాధాకృష్ణన్ ఎన్నికయ్యారు. బుధవారం ఉదయం 11.15 గంటలకు రాజ్ భవన్ లో బాధ్యతలు స్వీకరించనున్నారు. హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి రాధాకృష్ణన్ తో ప్రమాణం చేయించనున్నారు. ఈ నేపథ్యంలో ఈ రోజు రాత్రికి కొత్త గవర్నర్ సి.పి రాధాకృష్ణన్ హైాదరాబాద్ కు రానున్నారు.
రాష్ట్ర గవర్నర్ గా జార్ఖండ్ గవర్నర్ గా, పుదుచ్చేరి లెప్టినెంట్ గవర్నర్ గానూ రాధాకృష్ణన్ కు అదనపు బాధ్యతలను అప్పగించారు. 1998, 1999 లోక్ సభ ఎన్నికలలో రాధాకృష్ణన్ కోయంబత్తూరు నుంచి ఎంపిగా గెలిచారు. తమిళనాడు బిజెపి రాష్ట్ర అధ్యక్షుడిగా పని చేశారు. 2023 ఫిబ్రవరి 12 నుంచి జార్ఖండ్ గవర్నర్‌గా సేవలందిస్తున్నారు.
లోక్‌సభ ఎన్నికల్లో పోటీ కోసం రాష్ట్ర గవర్నర్ తమిళిసై సౌందర రాజన్ తన పదవికి రాజీనామా చేశారు. ఈ మేరకు తన రాజీనామా పత్రాన్ని సోమవారం రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు పంపించారు. అదే విధంగా పుదుచ్చేది లెఫ్ట్‌నెంటర్ గవర్నర్ పదవికి కూడా రాజీనామాను సమర్పించారు. రాబోయే లోక్‌సభ ఎన్నికల్లో ఆమె పోటీ చేయబోతున్నారు.