Monday, December 23, 2024

మెడికో ప్రీతిది ఆత్మహత్యే: సిపి రంగనాథ్

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: సీనియర్ వేధింపులు తట్టుకోలేక మెడికో ప్రీతి ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన ఘటన రాష్ట్రంలో సంచలనం రేపిన విషయం తెలిసిందే. ఈ ఘటనకు సంబందించి సిపి రంగనాథ్ సంచలన విషయాలు వెల్లడించారు. వరంగల్ మెడికో ప్రీతిది ఆత్మహత్యే అని సిపి రంగనాథ్ వెల్లడించారు. దీనికి సంబంధించి పదిరోజుల్లో ఛార్జషీట్ దాఖలు చేస్తాం అన్నారు. ప్రీతి ఆత్మహత్యకు ప్రధాన కారణం సైఫే అని తెలిపారు. ప్రీతి ఆత్మహత్య చేసుకున్నట్లు పోస్టుమార్టం రిపోర్టులో వెల్లడయ్యిందని చెప్పారు. పాయిజన్ తీసుకోవడం వల్లే ప్రీతి మృతి చెందినట్లు తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News