Friday, November 22, 2024

హైడ్రాలిక్ వాహనాలను ప్రారంభించిన సిపి

- Advertisement -
- Advertisement -

CP Sajjanar who launched Hydraulic Vehicles

సిసిటివిల కోసం ఏర్పాటు చేసిన పోలీసులు
21 మంది కానిస్టేబుళ్లకు శిక్షణ
నేరాల నియంత్రణలో సిసిటివిల కీలక పాత్ర
సైబరాబాద్ సిపి విసి సజ్జనార్

హైదరాబాద్ : నేరస్తులను పట్టుకోవడంలో సిసిటివిలు కీలక పాత్ర పోషిస్తున్నాయని సైబరాబాద్ పోలీస్ కమిషనర్ విసి సజ్జనార్ అన్నారు. గచ్చిబౌలిలోని సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్‌లో శుక్రవారం సైబరాబాద్ సిపి విసి సజ్జనార్ సిసికెమెరాలు అమర్చేందుకు ఏర్పాటు చేసిన హైడ్రాలిక్ వాహనాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో 1.5లక్షల సిసి కెమెరాలు ఏర్పాటు చేశామని తెలిపారు. సిసిటివిలు ఇన్‌స్టాల్ చేసిన తర్వాత మరమ్మతులకు వస్తున్నాయని తెలిపారు. శాంతిభద్రతల సమస్య ఉన్నప్పుడు వాటి నుంచి ఫుటేజ్ తీసుకోవడంలో ఇబ్బందులు ఎదురవుతున్నాయని తెలిపారు.

సిసి కెమెరాల మరమ్మత్తుకు 21మంది కానిస్టేబుళ్లకు శిక్షణ ఇచ్చామని తెలిపారు. వారికి కావాల్సిన మెటీరియల్‌ను ప్రభుత్వం తరఫున ఇస్తున్నామని తెలిపారు. తక్కువ కాలంలో వెయ్యికి పైగా కెమెరాలను రిపేర్ చేశామని తెలిపారు. రిపేర్ల కోసం వేరే వారిపై ఆధార పడాల్సి రావడంతో పోలీసులకే శిక్షణ ఇచ్చామని అన్నారు. రానున్న రోజుల్లో సిసి కెమెరాలు ఎక్కడ వచ్చిన తక్కువ సమయంలో రిపేర్ చేస్తారని తెలిపారు. పోలీసుల శిక్షణకు సహకరించిన డిసిపి ఎస్‌ఎం విజయ్‌కుమార్, ఎడిసిపి మాణిక్‌రాజ్, ఎసిపి సంతోష్ తదితరులు కృషి చేశారని తెలిపారు. కార్యక్రమంలో ఉమెన్ అండ్ చిల్డ్రన్ సేఫ్టీ వింగ్ డిసిపి అనసూయ, ఎడిసిపిలు మాణిక్‌రాజ్, శంకర్,ఎసిపి సంతోష్‌కుమార్, శంషాబాద్ ట్రాఫిక్ ఎసిపి చంద్రశేఖర్,ఈఓడబ్లూ హన్మంతరావు, ఎసిపి రాములు, ఎసిపి గంగారెడ్డి, ఎస్‌సిఎస్‌సి జనరల్ సెక్రటరీ కృష్ణ ఏదుల తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News