Sunday, January 5, 2025

ఆర్‌ఐ రిజర్వ్ ఇన్‌స్పెక్టర్లుగా పదోన్నతి పొందిన అధికారులను అభినందించిన సిపి శ్వేత

- Advertisement -
- Advertisement -

సిద్దిపేట: ఆర్‌ఐ రిజర్వ్ ఇన్‌స్పెక్టర్లుగా కార్తీక్, తిరుపతిలు పదోన్నతి పొందారు. సోమవారం సిపి శ్వేతను మర్యాద పూర్వకంగా కలిసి మొక్కలు అందజేశారు. ఈ సందర్బంగా సిపి చేతుల మీదుగా అధికారుల భుజాలపై ఇన్‌స్పెక్టర్ చిహ్నం అయిన మూడవ నక్షత్రాలను అలంకరించడంతో పాటు పదోన్నతి పొందిన అధికారులను అభినందించారు. అనంతరం అదనపు డిసిపి మహేందర్‌ను కలిసి మొక్కలు అందజేశారు. ఈ సందర్భంగా సిపి మాట్లాడుతూ పదోన్నతులు జీవన శైలిని మ్చా విధంగా ఉత్సాహన్ని కలిగిస్తాయి, నూతన బాధ్యతలు పెంచుతాయి. పదోన్నతి వల్ల వచ్చిన బాధ్యత సక్రమంగా నిర్వహిస్తూ డిపార్ట్‌మెంట్‌కు మంచి పేరు తీసుకురావాలన్నారు. అదే విధంగా సిద్దిపేట ఏఆర్ అదనపు డిసిపిలు రాంచంద్రారావు, సుబాష్ చంద్రబోస్‌లు ప్రమోషన్ పొందిన ఇరువురిని అభినందించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News