Sunday, December 22, 2024

పరీక్షా కేంద్రాలను పరిశీలించిన సిపి శ్వేత

- Advertisement -
- Advertisement -

సిద్దిపేట: గ్రూప్ 1 ప్రిలిమినరీ పరీక్ష కేంద్రాలను సందర్శించిన సిపి శ్వేత పరీక్ష కేంద్రాలను క్షేత్రస్థ్ధాయిలో పర్యవేక్షించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ పరీక్ష కేంద్రం వద్ద పటిష్టమైన బందోబస్తు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. పరీక్షా కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమలులో ఉన్నందున 500 మీటర్ల లోపు ఎవరు కూడా గుమిగూడ వద్దని సూచించారు. అధికారులు సిబ్బంది ప్రతి ఒక్కరిని క్షుణ్ణంగా తనిఖీలు నిర్వహించి పరీక్షా కేంద్రంలోకి పంపించడం జరిగింది. అదనపు డిసిపి మహేందర్, పబ్లిక్ అడ్రస్సింగ్ సిస్టం ద్వారా పరీ క్ష రాయడానికి వచ్చిన అభ్యర్థ్ధులకు తగు సలహాలు సూచనలు చేశా రు. పరీక్ష కేంద్రాలను సందర్శించి పర్యవేక్షణ చేశారు. సిద్దిపేట ఏసిపిలు దేవారెడ్డి, రమేశ్, సతీష్, పణిందర్, సిసిఆర్బి చంద్రశేఖర్, సిఐలు, ఎస్‌ఐలు పోలీస్ సిబ్బంది బందోబస్తు నిర్వహించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News