Friday, November 22, 2024

సైబరాబాద్‌లో ట్రాఫిక్ టాస్క్‌ఫోర్స్ వాహనాలు ప్రారంభించిన సిపి స్టిఫెన్ రవీంద్ర

- Advertisement -
- Advertisement -

CP Stephen Ravindra launched traffic task force vehicles

మనతెలంగాణ, హైదరాబాద్ : అత్యంత రద్దీ ఉన్న ప్రాంతాల్లో ట్రాఫిక్‌ను క్రమబద్దీకరించడానికి టాస్క్‌ఫోర్స్ వాహనానాలు ఏర్పాటు చేశామని సైబరాబాద్ పోలీస్ కమిషనర్ స్టిఫెన్ రవీంద్ర అన్నారు. ట్రాఫిక్ టాస్క్‌ఫోర్స్ 10 వాహనాలను జెండా విప్రో సర్కిల్ వద్ద జెండా ఊపి బుధవారం ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా సైబరాబాద్ పోలీస్ కమిషర్ స్టిఫెన్ రవీంద్ర మాట్లాడుతూ ట్రాఫిక్ అత్యంత రద్దీ ఉన్న ప్రాంతాల్లో ట్రాఫిక్‌ను క్రమబద్దీకరించేందుకు టాస్క్‌ఫోర్స్ వాహనాలను ఏర్పాటు చేశామని తెలిపారు. ఆగస్టులో ప్రారంభించిన ఆరు ట్రాఫిక్ టాస్క్‌ఫోర్స్ బైక్‌లు ట్రాఫిక్‌ను క్రమబద్దీకరించడంలో చాలా కీలక పాత్రపోషిస్తున్నాయని తెలిపారు. ట్రాఫిక్ టాస్క్‌ఫోర్స్ వాహనాలు కమాండ్ కంట్రోల్ పర్యవేక్షణలో పనిచేస్తాయని తెలిపారు. ట్రాఫిక్ డిసిపి శ్రీనివాసరావు మాట్లాడుతూ ఐటి కారిడార్, ఇండస్ట్రీయల్ ఏరియాలో వెహికల్ బ్రేక్‌డౌన్ అయినా లేదా రోడ్డుపై పార్కింగ్ చేసినా ట్రాఫిక్ జాం ఏర్పడే ప్రమాదం ఉందని అన్నారు.

టాస్క్‌ఫోర్స్ వాహనాలు రద్దీ ఉన్న ప్రాంతాల్లో తిరుగుతూ ట్రాఫిక్‌ను క్రమబద్దీకరిస్తుందని అన్నారు. ఈ వాహనాల విజిబుల్ వల్ల రాంగ్ సైడ్ డ్రైవింగ్, రోడ్డుపై పార్కింగ్, జాయ్ వాకింగ్, పుష్ కార్ట్‌రోడ్డుపై నిలిపి ఉంచడం వంటి ఉల్లంఘనలు తగ్గుతాయని అన్నారు. ఎస్‌సిఎస్‌సి వారి సహకారంతో 10 బైక్‌లను ఏర్పాటు చేయించామని తెలిపారు. 20మంది కానిస్టేబుళ్లు టాస్క్‌ఫోర్స్‌లో పనిచేస్తున్నారని తెలిపారు. కార్యక్రమంలో జాయింట్ సిపి అవినాష్ మహంతి, డిసిపలు కల్మేశ్వర్, శ్రీనివాసరావు, శిల్పవల్లి, సందీప్, జగదీశ్వర్‌రెడ్డి, ఎస్‌సిఎస్‌సి జనరల్ సెక్రటరీ కృష్ణ ఏదుల, ఎడిసిపి శ్రీనివాస్ రెడ్డి, ఎడిసిపి రియాజ్, ఎసిపి హన్మంతరావు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News