Tuesday, November 5, 2024

పెండింగ్ సైబర్ క్రైంలపై సమీక్ష

- Advertisement -
- Advertisement -
CP Stephen Ravindra Review on Pending Cyber ​​Crimes
నిర్వహించిన సైబరాబాద్ సిపి స్టిఫెన్ రవీంద్ర

హైదరాబాద్: పెండింగ్ సైబర్ కేసులను వెంటనే పరిష్కరించాలని సైబరాబాద్ పోలీస్ కమిషనర్ స్టిఫెన్ రవీంద్ర అన్నారు. సైబర్ నేరాల పెండింగ్ కేసులపై సైబరాబాద్ పోలీస్ కమిషనర్ స్టిఫెన్ రవీంద్ర మంగళవారం సమీక్ష సమావేశం నిర్వహించారు. అన్ని పోలీస్ స్టేషన్లలో నమోదయిన సైబర్ కేసుల గురించి అడిగి తెలుసుకున్నారు. సైబర్ నేరాలను నియంత్రించేందుకు ఎన్‌సిఆర్‌పి అండ్ సివైసిఏపిఎస్ ఉపయోగించి సైబర్ నేరాలను అడ్డుకోవాలని అన్నారు. పెండింగ్ సైబర్ నేరాల పరిష్కారానికి జోన్ల లెవల్‌లో ప్రత్యేకంగా టీములు ఏర్పాటు చేయాలని డిసిపిలను ఆదేశించారు. వచ్చే సమీక్ష సమావేశంలో వాటి ఫలితాలను చెప్పాలని తెలిపారు. ఎస్‌హెచ్‌ఓలు ఐఓసి, సైబర్ క్రైం డిసిపికి సహకరించాలని తెలిపారు. కొద్ది రోజుల్లో సైబర్ నేరాలపై న్యాయనిపుణులు, సాంకేతిక నిపుణులతో ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. వీరు కేసుల దర్యాప్తులో సహకరిస్తారని అన్నారు. సమావేశంలో డిసిపిలు రోహిణి, లావణ్య, ఎసిపి శ్రీధర్, ఇన్స్‌స్పెక్టర్లు కటకం శ్రీనివాసు, రవీందర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News