Wednesday, January 22, 2025

బైకులు చోరీ.. ఓఎల్ఎక్స్ లో సేల్

- Advertisement -
- Advertisement -

వరస చోరీలకు పాల్పడుతున్న నిందితులను రాచకొండ పోలీసులు శనివారం అరెస్ట్ చేశారు. నిందితులను ట్రాక్టర్ ట్రాలీల చోరీలకు పాల్పడుతున్న ముఠాను అరెస్ట్ చేశామని రాచకొండ సీపీ సుధీర్ బాబు మీడియా సమావేశంలో వెల్లడించారు. ముఠా నుంచి 13 ట్రాక్టర్ ట్రాలీలను స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. నిందితులపై పలు పోలీస్ స్టేషన్లలో 12 కేసులున్నాయని వెల్లడించారు.

అటు ఖరీదైన బైకులు చోరీలకు పాల్పడుతున్న వ్యక్తిని కూడా అరెస్ట్ చేసినట్లు ఆయన తెలిపారు. నిందితుడి నుంచి 23 బైకులు స్వాధీనం చేసుకున్నామని వెల్లడించారు. నిందితుడు సాయి కుమార్ పై పలు పిఎస్ లలో 19 కేసులున్నాయన్నారు. చోరీ చేసిన బైకులను సాయి కుమార్ ఓఎల్ఎక్స్ లో అమ్మేవాడనని సిపి తెలిపారు. వాహనాలు అమ్మేందుకు నకిలీ పత్రాలు సృష్టించేవాడని ఆయన పేర్కన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News