Monday, January 20, 2025

వాహనాలను అడ్డుకోలేదు: ఖమ్మం సిపి

- Advertisement -
- Advertisement -

ఖమ్మం: ఖమ్మంలో కాంగ్రెస్ పార్టీ జనగర్జన సభకు వెళ్తున్న వాహనాలను వెళ్లకుండా పోలీసులు అడ్డుకుంటూ వాహనాలను నిలుపుదల చేస్తున్నట్లు వస్తున్న వార్తలలో వాస్తవం లేదని ఖమ్మం పోలీస్ కమిషనర్ ఎస్. విష్ణు వారియర్ ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లాలో ట్రాఫిక్ డైవర్షన్ తప్ప ఎక్కడ చెక్‌పోస్టులు ఏర్పాటు చేయలేదని తెలిపారు. మీడియా, సామాజిక మాధ్యమాలలో అసత్య ఆరోపణలు చేయవద్దని సూచించారు. ఇలాంటి తప్పుడు ప్రచారం చేస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని తెలిపారు.

పోలీసులతో రేణుకచౌదరి వివాదం అవాస్తవం
కరుణగిరి వద్ద బారికేడ్లు పెట్టి వాహన తనిఖీ చేస్తూ సభకు ప్రజలను రాకుండా పోలీసులు అడ్డు పడుతున్నారని ఖమ్మం రూరల్ ఎస్‌ఐ వెంకటకృష్ణను మాజీ మంత్రి రేణుకా చౌదరి తోసేసినట్లు సామజిక మాధ్యమాలలో వస్తున్న వార్తలలో నిజంలేదని ఖమ్మం రూరల్ ఏసీపీ భస్వారెడ్డి తెలిపారు. ఎస్‌ఐ వెంకటకృష్ణతో రేణుకా చౌదరి వివాదమంటూ సోషల్ మీడియా ద్వారా అసత్య ప్రచారాలు, ఆరోపణ చేస్తూ పోలీసుల మనోభావాలను దెబ్బతీసేలా ప్రవర్తించడం సరికాదని, దీనిని పూర్తిగా ఖండిస్తున్నామని ఆయన పేర్కొన్నారు. ఇలాంటి చర్యలను ఉపేక్షించేది లేదని చట్టప్రకారం చర్య తీసుకుంటామని హెచ్చరించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News