మనతెలంగాణ/హైదరాబాద్ : రాష్ట్రంలోని ఉస్మానియా, కాకతీయ, శాతవాహన, తె లంగాణ, మహాత్మాగాంధీ, పాలమూరు, జె ఎన్‌టియుహెచ్, తెలంగాణ మహిళా విశ్వవిద్యాలయాల్లో సంప్రదాయ పోస్టు గ్రాడ్యుయేషన్ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించే ఉమ్మడి పిజి ప్రవేశ పరీక్ష (సిపిగెట్ -2024) నోటిఫికేషన్ విడుదలైంది. ఈ నెల 18 నుం చి సిపిగెట్ దరఖాస్తుల ప్రక్రియ ప్రారంభమవుతుంది. జూన్ 17వ తేదీ వరకు ఎలాంటి ఆలస్య రుసుం లేకుండా దరఖాస్తులు సమర్పించవచ్చు. రూ .500 ఆలస్య రుసుంతో జూన్ 25 వరకు, రూ .2 వేల ఆలస్య రు సుంతో జూన్ 30 వరకు తేదీ వరకు దరఖాస్తులు చేసుకోవచ్చు. జులై 5 నుంచి సిపిగెట్ పరీక్షలు ప్రారంభం కానున్నాయి. రాష్ట్ర ఉన్నత విద్యామండలి చైర్మన్ ఆర్.లింబాద్రి, ఉస్మానియా యూనివర్సిటీ విసి డి.రవీందర్ యాదవ్, సిపిగెట్ కన్వీనర్ ఐ.పాండురంగారెడ్డిలతో కలిసి బుధవారం విద్యాశాఖ ము ఖ్యకార్యదర్శి బుర్రా వెంకటేశం సిపిగెట్ నో టిఫికేషన్ విడుదల చేశారు.
ఈ కార్యక్రమం లో ఉన్నత విద్యామండలి వైస్ ఛైర్మన్ వి. వెంకటరమణ, కార్యదర్శి శ్రీరాం వెంకటేశ్, వైస్ ఛాన్స్‌లర్లు మలేశం, గోపాల్‌రెడ్డి,ఒయు రిజిస్ట్రార్ లక్ష్మినారాయణ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా విద్యాశాఖ ముఖ్యకార్యదర్శి బుర్రా వెంకటేశం మాట్లాడుతూ, రాష్ట్రంలోని అన్ని యూనివర్సిటీల లో పిజి ప్రవేశాలకు ఉమ్మడి ప్రవేశ పరీక్ష ని ర్వహించడం విద్యార్థులకు ఎంతో ప్రయోజకరమని వ్యాఖ్యానించారు. సిపిగెట్ ద్వారా మొత్తం 294 కాలేజీల్లో 51 పిజి కోర్సుల్లో ప్రవేశాలు కల్పిస్తున్నామని చెప్పారు.
ఉన్నత విద్యలో తెలంగాణ రా ష్ట్రం దేశ సగటు కంటే అధికంగా ఉన్నదని, ముఖ్యంగా మహిళలు, ఎస్‌సి,ఎస్‌టిలు ఉ న్నత విద్యను అభ్యసిస్తుండటం శుభపరిణా మం అని పేర్కొన్నారు. ఛైర్మన్ లింబాద్రి మాట్లాడుతూ, ఉస్మానియా, కాకతీయ, శా తవాహన, తెలంగాణ, మహాత్మాగాంధీ, పా లమూరు, జెఎన్‌టియుహెచ్, తెలంగాణ మ హిళా యూనివర్సిటీల్లోని సంప్రదాయ పిజి కోర్సుల్లో ప్రవేశాలను సిపిగెట్ ద్వారా భర్తీ చేయనున్నట్లు పేర్కొన్నారు. ఒయు విసి ర వీందర్ యాదవ్ మాట్లాడుతూ, ఏ సబ్జెక్టులో డిగ్రీ చదివిన వారైనా .. సోషల్ సైన్సెస్, లాంగ్వేజెస్ కోర్సుల్లో పిజి చేసేలా నిబంధనలు సవరించడం వల్ల ఇంజనీరింగ్, ఇతర సాంకేతిక కోర్సులు చదివిన విద్యార్థులు సైతం సోషల్ సైన్సెస్‌లో ప్రవేశాలు పొందుతున్నారని అన్నారు.