Monday, December 23, 2024

3న సిపిగెట్ నోటిఫికేషన్

- Advertisement -
- Advertisement -

CPGET notification on 3rd

 

మనతెలంగాణ/హైదరాబాద్ : రాష్ట్రంలోని అన్ని యూనివర్సిటీలల్లో పోస్టు గ్రాడ్యుయేషన్ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించే ఉమ్మడి ప్రవేశ పరీక్ష(సిపిగెట్) నోటిఫికేషన్ శుక్రవారం(జూన్ 3) వెలువడనుంది. వెంటనే దరఖాస్తుల ప్రక్రియను ప్రారంభం కానుంది. ఈ మేరకు సిపిగెట్ కన్వీనర్ ఏర్పాట్లు చేస్తున్నారు. పూర్తిగా విద్యార్థులకు అనుకూలంగా ఉండేలా ఈసారి పిజి ప్రవేశాలలో సంస్కరణలు తీసుకువచ్చారు. డిగ్రీలో ఏ సబ్జెక్టులో ఉత్తీర్ణత సాధించిన విద్యార్థి అయినా… పిజిసెట్‌లో వారి సామర్ధ్యాన్ని బట్టి ఆర్ట్ కోర్సుల్లో వారికి నచ్చిన సబ్జెక్టు చదివేందుకు అవకాశం కల్పించనున్నారు. పోస్టు గ్రాడ్యుయేషన్‌లో పొలిటికల్ సైన్స్, పబ్లిక్ అడ్మినిస్టేషన్, ఎకనామిక్స్, హిస్టరీ, తెలుగు, ఇంగ్లీష్ కోర్సుల్లో ప్రవేశాలు పొందడానికి డిగ్రీలో ఏ కోర్సు చేసినా అర్హత కల్పించనున్నారు.

ఇదివరకు ఈ పిజి కోర్సులు చేయాలంటే సంబంధిత సబ్జెక్టుతో తప్పనిసరిగా డిగ్రీ చదివి ఉండాలనే నిబంధన ఉండేది. ఉదాహరణకు బీ.కాం చదివిన విద్యార్థులకు ఎం.ఎ ఎననామిక్స్ చేసేందుకు అవకాశం ఉండేది కాదు. ఈ విషయం తెలియకుండా చాలా మంది విద్యార్థులు సిపిగెట్‌కు దరఖాస్తు చేసుకుని మంచి ర్యాంకులు సాధించినప్పటికీ కౌన్సెలింగ్ సమయంలో ఎం.ఎ ఎకనామిక్స్ చదివేందుకు అనర్హులమని తెలుసుకుని బాధపడేవారు. ఈసారి ఆ నిబంధనల్లో మార్పులు చేశారు. ఇదివరకు మాస్టర్ ఆఫ్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం, ఎంఎల్‌ఎస్‌ఐసీ, హ్యూమన్ రీసోర్స్ మేనేజ్మెంట్, టూరిజం మేనేజ్‌మెంట్, ఎం.ఎ సోషియాలజీ, ఎం.ఎ సోషల్ వర్క్, ఎం.ఎ ఆర్కియాలజీ తదితర కోర్సులకు డిగ్రీలో ఏ కోర్సు చేసినవారైనా అర్హులే. అదే తరహాలో ఈసారి మరిన్ని కోర్సులకు అవకాశం కల్పిస్తున్నారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News