Sunday, December 22, 2024

సిపిగెట్ నోటిఫికేషన్ విడుదల

- Advertisement -
- Advertisement -

CPGET notification released

జులై 4 వరకు ఆలస్య రుసుం లేకుండా దరఖాస్తులు
ఆగస్టు నుంచి 20 నుంచి పరీక్షలు

మనతెలంగాణ/హైదరాబాద్ : రాష్ట్రంలోని ఉస్మానియా, కాకతీయ, శాతవాహన, తెలంగాణ, మహాత్మాగాంధీ, పాలమూరు, జెఎన్‌టియుహెచ్, తెలంగాణ మహిళా విశ్వవిద్యాలయాల్లో సంప్రదాయ పిజి కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించే ఉమ్మడి పిజి ప్రవేశ పరీక్ష (సిపిగెట్ -2022) నోటిఫికేషన్ విడుదలైంది. ఉస్మానియా యూనివర్సిటీ ఇంఛార్జ్ వైస్ ఛాన్స్‌లర్ కె.సీతారామారావు, సిపిగెట్ కన్వీనర్ ఐ.పాండురంగారెడ్డిలతో కలిసి రాష్ట్ర ఉన్నత విద్యామండలి చైర్మన్ ఆర్.లింబాద్రి సోమవారం సిపిగెట్ నోటిఫికేషన్ విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో ఉన్నత విద్యామండలి వైస్ ఛైర్మన్ వి.వెంకటరమణ, కార్యదర్శి శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఛైర్మన్ లింబాద్రి మాట్లాడుతూ, జులై 4వ తేదీ వరకు ఎలాంటి ఆలస్య రుసుం లేకుండా దరఖాస్తులు సమర్పించవచ్చని వెల్లడించారు.

రూ .500 ఆలస్య రుసుంతో జులై 11వ తేదీ వరకు, రూ .2 వేల ఆలస్య రుసుంతో జులై 15వ తేదీ వరకు దరఖాస్తులు చేసుకోవచ్చని తెలిపారు. జులై 20 నుంచి సిపిగెట్ పరీక్షలు జరగనున్నట్లు వెల్లడించారు. ఉస్మానియా, కాకతీయ, శాతవాహన, తెలంగాణ, మహాత్మాగాంధీ, పాలమూరు, జెఎన్‌టియుహెచ్‌లతో పాటు ఈ పాటు ఈ ఏడాది కొత్తగా రానున్న తెలంగాణ మహిళా యూనివర్సిటీల్లోని సంప్రదాయ పిజి కోర్సుల్లో ప్రవేశాలను సిపిగెట్ ద్వారా భర్తీ చేయనున్నట్లు పేర్కొన్నారు. ఈ 8 విశ్వవిద్యాలయాల పరిధిలోని 320 కళాశాలల్లోని 50 కోర్సుల్లో 44 వేల సీట్లు అందుబాటులో ఉన్నాయని అన్నారు. ఏ సబ్జెక్టులో డిగ్రీ చదివిన వారైనా .. సోషల్ సైన్సెస్, లాంగ్వేజెస్ కోర్సుల్లో పిజి చేసేలా ఈ ఏడాది నిబంధనలు సవరించినట్లు లింబాద్రి తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News