Wednesday, January 22, 2025

నేటి నుంచి సిపిగెట్ ప్రత్యేక విడత కౌన్సెలింగ్

- Advertisement -
- Advertisement -

CPGET special phase counseling starting today

మనతెలంగాణ/హైదరాబాద్ : రాష్ట్ర వ్యాప్తంగా ఆరు విశ్వవిద్యాలయాల్లో పోస్టు గ్రాడ్యుయేషన్(పిజి) కోర్సుల్లో ఖాళీగా ఉన్న సీట్ల భర్తీకి బుధవారం నుంచి ప్రత్యేక విడత కౌన్సెలింగ్ నిర్వహించనున్నారు. ఈ మేరకు సిపిగెట్ కన్వీనర్ ఐ.పాండురంగారావు షెడ్యూల్ విడుదల చేశారు. ఈ నెల 9 నుంచి 11వ తేదీ వరకు అర్హులైన అభ్యర్థులు ఆన్‌లైన్ సర్టిఫికెట్ వెరిఫికేషన్‌తో వెబ్ ఆప్షన్ల నమోదు చేసుకోవాలని తెలిపారు. కొత్తగా రిజిష్టర్ చేసుకున్న అభ్యర్థులు ఈ నెల 12వ తేదీన వెబ్ ఆప్షన్లు నమోదు చేసుకోవాలని పేర్కొన్నారు. ఈ నెల 14వ తేదీన సీట్లు కేటాయించనున్నట్లు వెల్లడించారు. సీట్లు పొందిన అభ్యర్థులు ఈ నెల 15,16 తేదీలలో ఆయా కళాశాలల్లో రిపోర్ట్ చేయాలని తెలిపారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News