Sunday, December 22, 2024

కాంగ్రెస్ తో సిపిఐ పొత్తు ఖరారు

- Advertisement -
- Advertisement -

కొత్తగూడెం అసెంబ్లీ స్థానంతో పాటు మరో ఎంఎల్‌సి స్థానం ఇచ్చేందుకు కాంగ్రెస్ ప్రతిపాదన
అంగీకరించిన సిపిఐ

మన తెలంగాణ/హైదరాబాద్ : కాంగ్రెస్‌తో సిపి ఐ పొత్తు ఖరారైంది. శుక్రవారం రాత్రి సిపిఐ నేతలు టి పిసిసి చీఫ్ రేవంత్‌తో భేటీ అయి చర్చలు జరిపారు. సిపిఐకి కొత్తగూడెం, మరో ఎంఎల్‌సి ఇచ్చేందుకు అంగీకారం కుదిరింది. మునుగోడులో ఫ్రెండ్లీ కాంటెస్ట్ చేసుకుందామని సిపిఐ చేసిన ప్రతిపాదనను కాంగ్రెస్ నేతలు వద్దన్నట్లు సమాచారం. ఇటు ఖమ్మం జిల్లాలో మరో పార్టీ సిపిఎంకు సీటు ఇవ్వాలని సిపిఐ సూచించగా..ఇప్పటికే సిపిఎం పార్టీతో కాంగ్రెస్ పార్టీ జాతీయ నేతలు చర్చలు జరుపుతున్నారని రేవంత్ అన్నట్లు తెలుస్తోంది. కాగా సిపిఎం ఇప్పటికే కాంగ్రెస్‌తో చర్చలు జరపగా వారు కోరినన్ని స్థానాలు ఇవ్వలేమని కాంగ్రెస్ చెప్పింది.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News