Monday, December 23, 2024

కర్నాటకలో 215 నియోజకవర్గాల్లో కాంగ్రెస్‌కు సిపిఐ మద్దతు!

- Advertisement -
- Advertisement -

బెంగళూరు: రాబోయే కర్నాటక ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి ఊతం ఇచ్చేందుకుగాను భారత కమ్యూనిస్టు పార్టీ(సిపిఐ) 215 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఆ పార్టీకి మద్దతు ఇవ్వబోతోంది. అంతేకాకుండా ఏడు నియోజకవర్గాల్లో వామపక్షాల అభ్యర్థులకు మద్దతు ఇవ్వాలని కోరుతోంది.

‘సిపిఐ రాష్ట్రంలోని ఏడు నియోజవర్గాల్లో పోటీచేయబోతోంది. అవి ముదిగేరే, అలంద్, జెవార్గి, కుద్లగి, కెజిఎఫ్, సిరా, మదికెరి. మిగిలిన 215 అసెంబ్లీ నియోజకవర్గాల్లో సిపిఐ, కాంగ్రెస్ అభ్యర్థులకు మద్దతునివ్వనున్నది’ అని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి సాథి సుందరేశ్ ఓ ప్రకటనలో తెలిపారు.

కాంగ్రెస్ నాయకుడు కూడా ఈ విషయాన్ని ధ్రువీకరించారు. ఏడు స్థానాల్లో ‘స్నేహపూర్వక పోటీ’ ఉంటుందని అన్నారు. ‘మేము సిపిఐతో అవగాహనకు వచ్చాము. వారు ఏడు స్థానాల్లో అభ్యర్థులను నిలబెట్టారు. ఇంకా నిలబెట్టవచ్చు. ఏడు స్థానాల్లో స్నేహకపూర్వక పోటీ ఉంటుందని, మిగతా 197 స్థానాల్లో సిపిఐ కేడెర్ కాంగ్రెస్‌కు సహకరించనున్నది. అది కూడా బేషరతుగా. మేమంతా కలిసి కట్టుగా బిజెపితో తలపడనున్నాము’ అని కాంగ్రెస్ నాయకుడు సూర్జేవాలా ఆదివారం తెలిపారు.
కర్నాటకలో బిజెపి 224 సీట్లలో తన అభ్యర్థులను పోటీకి నిలిపింది. కాంగ్రెస్ 223 నియోజకవర్గాల్లో తన అభ్యర్థులను పోటీకి నిలిపింది. జెడి(ఎస్) 211 స్థానాల్లో, ఆమ్ ఆద్మీ పార్టీ 212 స్థానాల్లో తన అభ్యర్థులను పోటీకి నిలిపింది. కాగా 1379 మంది స్వతంత్ర అభ్యర్థులు కూడా పోటీలో ఉన్నారు.

CPI supports Congress

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News