Tuesday, November 5, 2024

రూ. 11 కోట్ల బకాయిలు చెల్లించండి..సిపిఐకి ఐటి నోటీసులు

- Advertisement -
- Advertisement -

కాంగ్రెస్ పార్టీకి నోటీసులు జారీచేసిన రోజే ప్రతిపక్ష ఇండియా కూటమిలో మరో భాగస్వామ్య పక్షమైన సిపిఐకి కూడా ఆదాయం పన్ను శాఖ(ఐటి) శుక్రవారం నోటీసులు జారీచేసింది. గత కొన్ని సంవత్సరాలుగా ఐటి రిటర్న్‌లు దాఖలు చేస్తున్న సమయంలో పాత పాన్ కార్డునే ఉపయోగిస్తున్నందుకు రూ. 11 కోట్ల బకాయిలు చెల్లించాలంటూ సిపిఐకి ఐఇటి శాఖ నోటీసులు జారీచేసింది. ఈ విషయాన్ని వర్గాలు శుక్రవారం వెల్లడించాయి. ఐటి అధికారులు జారీచేసిన నోటీసులను సవాలు చేసేందుకు న్యాయవాదులను సిపిఐ నాయకత్వం సంప్రదిస్తోందని వర్గాలు తెలిపాయి. పాత పాన్ కార్డు వాడకంలో జరిగిన పన్ను వ్యత్యాసాలకు జరిమానాలు,

వడ్డీతోసహా కలిపి బకాయిల కింద రూ. 11 కోట్లు చెల్లించాలని ఐటి శాఖ సిపిఐకి నోటీసులు జారీచేసిందని వారు చెప్పారు. ఈ విషయమై న్యాయ సలహా కోసం న్యాయవాదులను సంప్రదిస్తున్నట్లు సిపిఐ సీనియర్ నాయకుడు ఒకరు తెలిపారు. ఇదిలా ఉండగా గడచిన 72 గంటల్లో తనకు ఐటి శాఖ నుంచి 11 నోటీసులు అందిచనట్లు తృణమూల్ కాంగ్రెస్ నాయకుడు సాకేత్ గోఖలే శుక్రవారం వెల్లడించారు. లోక్‌సభ ఎన్నికలకు ముందు ప్రతిపక్షాన్ని ఆర్థికంగా క్రుంగదీయడానికి బిజెపి పన్ను ఉగ్రవాదానికి పాల్పడుతోందని కాంగ్రెస్ ఆరోపిస్తోంది.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News