- Advertisement -
అమరావతి: జగన్ పాలనలో మంత్రులకు స్వేచ్ఛ లేదని సిపిఐ నేత రామకృష్ణ తెలిపారు. కార్మిక, ఉద్యోగుల సమ్మెకు మద్దతుగా సమవేశం ఏర్పాటు చేసిన సందర్భంగా సిపిఐ నేత రామకృష్ణ మాట్లాడారు. లక్ష మంది అంగన్వాడీలపై సర్కార్ చర్యలు తీసుకుంటుందా? అని ప్రశ్నించారు. జీతం ఇవ్వడానికి డబ్బులు లేవని ఎపి ప్రభుత్వం చెబుతోందని, తెలంగాణలో కెసిఆర్‌ను ప్రజలు ఇంటికి పంపారని, త్వరలో జగన్‌ను కూడా ప్రజలు ఇంటికి పంపిస్తారని ఆయన ఎద్దేవా చేశారు.
- Advertisement -