కేంద్రాన్ని బీజేపీ ప్రభుత్వం గవర్నర్ వ్యవస్థను దుర్వినియోగం చేస్తున్న నేపథ్యంలో గవర్నర్ వ్యవస్థను రద్దు చేయాలని భారత కమ్యూనిస్టు పార్టీ సీపీఐ ఆధ్వర్యంలో ఈ నెల 7వ తేదీన జరిగే రాజ్‌భవన్ ముట్టడికి సీపీఐ శ్రేణులు తరలిరావాలని సీపీఐ జిల్లా కార్యదర్శి మర్రి వెంకటస్వామి ఒక ప్రకటనలో పిలుపునిచ్చారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. దేశానికి స్వాతంత్య్రం రాక ముందు బ్రిటీష్ పాలకుల పరిపాలనలో గవర్నర్ వ్యవస్థ ఉండేదని, బ్రిటిష్ ప్రభుత్వం గవర్నర్లు పాలకులుగా ప్రజాతంత్ర ప్రభుత్వాలు లేకుండా పరిపాలన నడిచేదని, భారతదేశానికి స్వాతంత్య్రం సిద్దించిన తర్వాత కూడా గవర్నర్ వ్యవస్థను కొనసాగించడం ప్రజాస్వామ్యంగా ఎంపికైన విపక్ష పాలిత ప్రభుత్వాలను కూల్చడం కోసం కేంద్రంలో అధికారంలో ఉన్న పాలక ప్రభుత్వాలు గవర్నర్ వ్యవస్థను దుర్వినియోగం చేయడం దుర్మార్గపు చర్య అని మన్నారు. ఈ నెల 7వ తేదీన హైదరాబాద్‌లోని రాజ్‌భవన్ ముట్టడి కార్యక్రమం జరుగుతుందని సీపీఐ శ్రేణులు అధిక సంఖ్యలో హాజరు కావాలని పిలుపునిచ్చారు.