Monday, December 23, 2024

మోడీపై నారాయణ ఆగ్రహం

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్ : మహిళా రిజర్వేషన్ బిల్లును మోడీ సర్కార్ పార్లమెంట్‌లో ప్రవేశపెడితే తమ పార్టీ సంపూర్ణ మద్దతును ఇస్తుందని సిపిఐ జాతీయ కార్యదర్శి నారాయణ చెప్పారు. భారత జాగృతి సమితి ఆధ్వర్యంలో మహిళా రిజర్వేషన్ బిల్లుపై న్యూఢిల్లీలో బుధవారం రౌండ్ టేబుల్ సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశానికి పలు పార్టీల నుండి ప్రతినిధులు, ఆయా పార్టీల ఎంపిలు హాజరయ్యారు. ఈ సమావేశానికి హాజరైన సిపిఐ జాతీయ కార్యదర్శి డాక్టర్ నారాయణ ప్రసంగించారు. వాజ్‌పెయ్ ప్రధానమంత్రిగా ఉన్న సమయంలో సిపిఐ నేత, మాజీ ఎంపి గీతా ముఖర్జీ నేతృత్వంలో కమిటీని ఏర్పాటు చేసిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. దేశవ్యాప్తంగా పర్యటించి మహిళా రిజర్వేషన్‌క విషయమై ప్రభుత్వానికి గీతా ముఖర్జీ కమిటీ నివేదికను ఇచ్చిందన్నారు.

ఆ తర్వాత కేంద్రంలో దేవెగౌడ ప్రధానిగా బాధ్యతలు చేపట్టారన్నారు. మహిళా రిజర్వేషన్ బిల్లును ఆమోదిస్తే చోటు చేసుకునే ఇబ్బందుల గురించి ఓ నేత ప్రస్తావించాడన్నారు. మహిళా రిజర్వేషన్ బిల్లుకు ఆ నేత అడ్డుపుల్ల వేశాడని నారాయణ చెప్పారు. ఆ నేత పేరును తాను ఇక్కడ ప్రస్తావించదల్చుకోలేదన్నారు. ప్రస్తుత ప్రధాని నరేంద్ర మోడీ కూడా అధికారంలోకి రాకముందు మహిళా రిజర్వేషన్ బిల్లు విషయమై హామీ ఇచ్చాడన్నారు. కానీ అధికారంలోకి వచ్చి తొమ్మిదేళ్లు కావస్తున్నా మహిళా రిజర్వేషన్ బిల్లును పార్లమెంట్‌లో ఎందుకు ప్రవేశపెట్టలేదో చెప్పాలని ఆయన ప్రశ్నించారు. మోడీకి సంపూర్ణ మెజారిటీ కూడా ఉందన్నారు. దేవెగౌడ, మన్మోహన్ సింగ్, ఐకె గుజ్రాల్ ప్రభుత్వాలకు సంపూర్ణ మెజారిటీ లేని విషయాన్ని నారాయణ ఈ సందర్భంగా ప్రస్తావించారు.

సంపూర్ణ మెజారిటీ లేని కారణంగా తమ మిత్రపక్షాలు మహిళా రిజర్వేషన్ బిల్లును మోడీ ఎందుకు ప్రవేశపెట్టడం లేదో చెప్పాలన్నారు. పార్లమెంట్‌లో మోడీ సర్కార్ మహిళా రిజర్వేషన్ బిల్లును ప్రవేశపెడితే లెఫ్ట్, బిఆర్‌ఎస్ కూడా మద్దతు ఇస్తాయని నారాయణ ప్రకటించారు. రాజకీయంగా బిజెపితో కమ్యూనిస్టులకు వైరం ఉందన్నారు. కానీ మహిళా రిజర్వేషన్‌క బిల్లుపై తాము మద్దతిస్తామని ఆయన స్పష్టం చేశారు. కవిత, తాను తెలంగాణ ఉద్యమం నుండి కలిసి పనిచేస్తున్నామన్నారు. తెలంగాణకు మద్దతు ఇచ్చిన జాతీయ పార్టీ సిపిఐ అని ఆయన చెప్పారు. మహిళా రిజర్వేషన్ బిల్లు విషయమై చట్టసభల్లోనూ, బయట తాము పోరాటం చేస్తున్నామని నారాయణ తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News