Monday, December 23, 2024

టిడిపిని ఇండియా కూటమిలోకి ఆహ్వానిస్తున్నాం: సిపిఐ నారాయణ

- Advertisement -
- Advertisement -

అమరావతి: ఆంధ్రప్రదేశ్ లో ఆధికార వైసిపి పార్టీ పాలనపై సిపిఐ నేత నారాయణ కీలక వ్యాఖ్యలు చేశారు. వచ్చే ఎన్నికల్లో వైైసిపి పార్టీని ఓడిస్తేనే ఎపి ప్రజలకు న్యాయం జరుగుతుందని ఆయన అన్నారు. జగన్ ప్రభుత్వాన్ని గద్దె దించాలంటే.. టీడీపీ, జనసేన,కాంగ్రెస్, లెఫ్ట్ పార్టీలు కలిసి రాబోయే ఎన్నికల్లో పోటీ చేయాలన్నదే మా ఉద్దేశమన్నారు. టిడిపిని ఇండియా కూటమిలోకి ఆహ్వానిస్తున్నామని ఈ సందర్భంగా నారాయణ అన్నారు.

బిజెపి పార్టీతో రెండు తెలుగు రాష్ట్రాలు నష్టపోయాయని ఫైర్ అయ్యారు. ప్రత్యేక హోదా సహా ఏదీ రాలేదని, తెలుగు రాష్ట్రాలకు అన్యాయం చేసిన పార్టీ ఏదైనా ఉందంటే అది బిజెపినే అని ఆయన దుయ్యబట్టారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News