Wednesday, December 25, 2024

సిపిఐ సీనియర్‌ నేత పువ్వాడ నాగేశ్వరరావుకు తీవ్ర అస్వస్థత

- Advertisement -
- Advertisement -

భద్రాద్రి రామయ్య కళ్యాణానికి హజరు కాలేకపోతున్న మంత్రి పువ్వాడ అజయ్

హైదరాబాద్: సిపిఐ సీనియర్‌ నేత, ఖమ్మం మాజీ ఎమ్మెల్యే పువ్వాడ నాగేశ్వరరావు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. ఆయనను మెరుగైన వైద్యం కోసం సికింద్రాబాద్‌ కిమ్స్‌ ఆస్పత్రికి తరలించారు. బుధవారం ఉదయం ఖమ్మంలోని తన నివాసంలో అస్వస్థతకు గురైన పువ్వాడకు తొలుత మమత ఆస్పత్రిలో చికిత్స అందించారు. ఈ క్రమంలో హైదరాబాద్‌ నుంచి వచ్చిన ఆయన కుమారుడు, రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్‌.. తన తండ్రికి మెరుగైన వైద్యం అందించేందుకు వెంటనే అంబులెన్స్‌లో ఆయనను హైదరాబాద్‌కు తరలించారు. ఈ సందర్భంగా పోలీసులు అంబులెన్స్‌కు అంతరాయం కలుగకుండా ఆ మార్గంలో గ్రీన్‌చానెల్‌ను ఏర్పాటు చేశారు. పువ్వాడ నాగేశ్వరరావుకు కిమ్స్‌ వైద్యులు ప్రత్యేక వైద్య సేవలు అందిస్తున్నారు.

ప్రస్తుతం వెంటిలేటర్‌పై ఉంచి పువ్వాడకు చికిత్స అందిస్తున్నారు. దీంతో తన తండ్రి అనారోగ్యం దృష్ట్యా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న నేపథ్యంలో ఇవాళ భద్రాచలంలో జరిగే శ్రీ సీతారాముల కళ్యాణం కి మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ హాజరుకాలేకపోతున్నారు. హైదరాబాద్ లోని ఆస్పత్రిలోనే రాత్రిని ఆయన తండ్రితోనే మంత్రి ఉన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News