Sunday, December 22, 2024

లాలూతో సిపిఐ నేత రాజా భేటీ

- Advertisement -
- Advertisement -

పాట్నా : సిపిఐ ప్రధాన కార్యదర్శి డి రాజా గురువారం ఆర్‌జేడీ అధ్యక్షుడు లాలూ ప్రసాద్ యాదవ్‌ను కలుసుకుని కేంద్రం లోని బీజేపీపై పోరు గురించి చర్చలు జరిపారు. బీహార్‌లో సిపిఐ విద్యార్థి విభాగం ఎఐఎస్‌ఎఫ్ సమావేశంలో పాల్గొనడానికి రాజా వచ్చారు. ఈ సందర్భంగా లాలూ ప్రసాద్ యాదవ్, మాజీ సిఎం రబ్రీదేవీలతో వారి నివాసంలో భేటీ అయ్యారు. ఆ తరువాత పాత్రికేయులతోరాజా మాట్లాడారు. దేశం లోని సెక్యులర్, ప్రజాస్వామ్య వ్యవస్థలను పరిరక్షించడానికి విపక్ష కూటమి ఇండియా ఏర్పాటు కావడం అత్యంత అవసరమని పేర్కొన్నారు. మరికొన్ని పార్టీలు ఈ కూటమిలో చేరే అవకాశం ఉందన్నారు. వచ్చే లోక్‌సభ ఎన్నికల దృష్టా బీజేపీ ఈ కూటమిని చూసి భయపడుతోందని వ్యాఖ్యానించారు. విపక్ష కూటమికి మద్దతు కోసం కార్మికులను, రైతులును, మహిళలు, విద్యార్థులను సమన్వయంతో సిపిఐ సమైక్యపరుస్తోందని చెప్పారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News