మనతెలంగాణ/బొడ్డుప్పల్: ప్రజా సమస్యలున్నంత వరకు ఎర్రజెండా పార్టీలు ఉంటాయని , ఓట్లు, సీట్లు మాకు ప్రధానం కాదని సిపిఐ(ఎం) పార్టీ మేడ్చల్ జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు చింతల యాదయ్య తెలిపారు. ప్రజా సమస్యలపై ఉద్యమాలను మరింత ఉదృత్తం చేసేందుకు సిద్దం అవుతున్నామన్నారు.. ఇందుకు డిసెంబర్ 4,5 తేదీల్లో పీర్జాదిగూడ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని కుర్ర ఎల్లయ్య కన్వెన్షన్ హాల్లో నిర్వహించనున్న జిల్లా మహాసభల వేదికగా కార్యచరణను రూపొందించుకోనున్నట్లు ఆయన తెలిపారు. సోమవారంమేడిపల్లి ప్రెస్‌క్లబ్‌లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో చింతల యాదయ్య, జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు కోమటి రవి, నాయకులు కర్రె జంగయ్య, అంజయ్య, శైలజ, మండల కార్యదర్శి ఎన్.సృజన, ఎర్రం శ్రీనివాస్‌లు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా సిపిఐ(ఎం) నాయకులు మాట్లాడుతూ డిసెంబర్ 4,5 తేదీల్లో జరిగే జిల్లా మహాసభలను జయప్రదం చేయాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. నేడు ప్రజా వ్యతిరేక విధానాలను అమలు చేయడంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వం పోటీ పడుతున్నాయన్నారు. వరి ధాన్యాన్ని కోనుగోలు చేయాల్సిన కేంద్రం,కొనమని చెప్పడం, రాష్ట్ర ప్రభుత్వం వరి వేయోద్దంటూ ప్రకటనలు చేయడం శోచనీయమన్నారు. కేంద్రం కొనకపోతే రాష్ట్ర కోనుగోలు చేయాలని ఆయన డిమాండ్ చేశారు.