Saturday, March 29, 2025

ఆ విమర్శలు ఎవరు చేసినా తప్పే: సాంబశివరావు

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: సభ జరుగుతున్న తీరు చాలా బాధాకరంగా ఉందని సిపిఐ ఎంఎల్‌ఎ కూనంనేని సాంబశివరావు అసహనం వ్యక్తం చేశారు. పదో రోజు అసెంబ్లీ సమావేశాల సందర్భంగా శాసన సభలో కూనంనేని మాట్లాడారు.  పొలిటికల్ కామెంట్స్‌కు ఇది వేదిక కాదని, వ్యక్తిగత విమర్శలు ఎవరు చేసినా తప్పే అని, కెటిఆర్ కమిషన్లు అంటూ కామెంట్లు చేయడం కరెక్ట్ కాదు అని కూనంనేని సూచించారు. ప్రభుత్వంలోని పెద్దలు 30 శాతం కమిషన్లు తీసుకుంటున్నారని కాంగ్రెస్ పార్టీ ఎంఎల్‌ఎలే అనుకుంటున్నారని కెటిఆర్ ఆరోపణలు చేశారు. 20 శాతం కమిషన్లని సచివాలయంలో ధర్నాలు చేస్తున్నారని కెటిఆర్ ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News