Wednesday, January 22, 2025

సంధ్య థియేటర్ ఘటనలో ప్రభుత్వమే తొలి ముద్దాయి: సిపిఐ నారాయణ

- Advertisement -
- Advertisement -

అమరావతి: అసెంబ్లీలో అల్లుఅర్జున్ పై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసిన కామెంట్స్ హాట్ టాపిక్ గా మారాయి. ఈ క్రమంలో సిపిఐ నేత నారాయణ పుష్ప 2 మూవీ తొక్కిసలాట ఘటనపై తొలిసారిగా స్పందించారు. ఈ కేసులో తొలి ముద్దయి ప్రభుత్వమేనని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘పుష్ప2’ సినిమాకు రాయితీలిచ్చి ప్రజలపై భారం మోపడమే కాకుండా..బెనిఫిట్ షోలకు అనుమతి ఇచ్చి.. ఇప్పుడు రాద్దాంతం చేస్తుందని, ఈ ఘటనలో మొదటి ముద్దాయి తెలంగాణ సర్కారేనని మండిపడ్డారు. ఆదర్శ నటులు అల్లు తరం వారు ఇలాంటి సినిమాలను ప్రోత్సహించడమా? అని కూడా తప్పు బట్టారు. ఇలాంటివి పునరావృతం కాకుండా కళాకారులు చూసుకోవాలని, బాధిత కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని డిమాండ్ చేశారు. త్వరలోనే మా పార్టీ తరుపున బాధిత కుటుంబానికి సాయం ప్రకటిస్తామని సిపిఐ నారాయణ తెలిపారు.

కాగా, రేవంత్ రెడ్డి.. అసెంబ్లీలో బన్నీ వ్యక్తిత్వాన్ని కించపరిచే విధంగా హేళన చేస్తూ.. ఆయనకు కాలు విరిగిందా?.. కన్ను పోయిందా? అంటూ మాట్లాడటం సరైంది కాదని.. అది అనుకోకుండా జరిగిన ఘటనలాగే చూడాలని నెటిజన్స్ సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. ఓటుకు నోటు కేసులో రేవంత్ రెడ్డి.. జైలు నుంచి విడుదలైన తర్వాత.. ఆయన పరామర్శించేందుకు నాయకులు వచ్చిన వీడియోనో సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు. అప్పుడేమైనా.. రేవంత్ రెడ్డి పాకిస్థాన్ తో యుద్ధం చేసి వచ్చాడా..? అంటూ ప్రశ్నిస్తున్నారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News