Thursday, January 23, 2025

సిపిఐ నారాయణ అరెస్ట్

- Advertisement -
- Advertisement -

 

హైదరాబాద్: తెలంగాణ కు ప్రధాని మోడీ రాకను వ్యతిరేకిస్తూ నిరసనలు వ్యక్తమతున్నాయి. నగరంలోని సిపిఐ రాష్ట్ర కార్యాలయం ముందు నిరసన వ్యక్తం చేస్తున్న సిపిఐ జాతీయ కార్యదర్శి నారాయణతో పాటు పలువురు కార్యకర్తలను పోలీసులు శనివారం అరెస్ట్ చేశారు. శుక్రవారం రాత్రి నుంచి పోలీసులు ఆఫీసును ఆక్రమించి అక్రమ అరెస్ట్ చేశారని పోలీసులపై నారాయణ ఫైర్ అయ్యారు. అక్రమ అరెస్టులను ఖండిస్తున్నామని పేర్కొన్నారు. అప్రజాస్వామిక నిర్ణయాలు తీసుకుంటున్న మోడీకి దేశాన్ని పాలించే నైతిక హక్కు లేదని, గో బ్యాక్ మోడీ అని నారాయణ తెలిపారు. ప్రధాని నరేంద్ర మోడీ తెలంగాణ పర్యటనకు గాను విశాఖ నుంచి హైదరాబాద్ కు చేరుకున్నారు. సాయంత్రం 6.40 గంటలకు బేగంపేట విమానాశ్రయం నుంచి ప్రధాని ఢిల్లీకి బయల్దేరుతారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News