Sunday, January 19, 2025

బాబు.. రేవంత్ ను చూసి నేర్చుకో: సిపిఐ నారాయణ

- Advertisement -
- Advertisement -

ఆంధ్రప్రదేశ్ లో అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్న నేపథ్యంలో పొత్తుల కోసం పలు పార్టీలు ప్రయత్నిస్తున్నాయి. ఈ క్రమంలో సిపిఐ సీనియర్ నేత నారాయణ.. టీడీపీ అధినేత చంద్రబాబుపై కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం చంద్రబాబు భయాందోళనలో ఉన్నట్లు కనిపిస్తుందని అన్నారు. రానున్న ఎన్నికల్లో పోల్ మేనేజ్‌మెంట్, కేంద్రం ఇబ్బందులు పెడుతుందని చంద్రబాబు భయపడుతున్నారన్నారు.

చంద్రబాబులో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సగం కూడా లేరని.. కానీ, రేవంత్ ఎంతో ధైర్యంగా బీఆర్ఎస్, బీజేపీలతో పోరాటం చేశారని.. రేవంత్ నుంచి సగం ధైర్యం అప్పుగా తెచ్చుకోవాలని ఆయన బాబుకు సూచించారు ప్రస్తుతం ఏపీలో ప్రత్యేక పరిస్థితులు ఉన్నాయని… వైసీపీకి వ్యతిరేకంగా కాంగ్రెస్ తో కలిసి వస్తే తాము పొత్తు పెట్టుకుంటామని ఆయన చెప్పారు. వైసీపీ, బీజేపీకి వ్యతిరేకంగా రాష్ట్రంలో కూటమి ఏర్పాటు కావాల్సిన అవసరం ఉందని నారాయణ అన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News