- Advertisement -
తెలంగాణ మాజీ సిఎం కెసిఆర్, ఎపి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి భేటీపై సీపీఐ నేత నారాయణ కీలక వ్యాఖ్యలు చేశారు. రాజకీయ వ్యూహంలో భాగంగానే.. కేసీఆర్, వైఎస్ జగన్ భేటీ జరిగిందని ఆయన అన్నారు. పోలింగ్ డే రోజు.. కెసిఆర్ కు లాభం చేకూర్చేలా సాగర్ జలాలపై తెలంగాణతో ఎపి ప్రభుత్వం గొడవ పెట్టుకుందని, సెంటిమెంట్ రగిల్చి కెసిఆర్ ను గెలిపించేందుకు జగన్ సహకారం అందించారని ఆరోపించారు. కానీ ప్రజలు వారి డ్రామాలను నమ్మలేదని..తగిన గుణపాఠం చెప్పారన్నారు. ఇప్పుడు ఎపిలో రాబోయే ఎన్నికల్లో తనకు సహకారం అందించాలని కోరేందుకే జగన్ వచ్చారని నారాయణ అన్నారు.
సర్జరీ తర్వాత కెసిఆర్.. జూబ్లీహిల్స్ నందినగర్ లోని తన నివాసంలో విశ్రాంతి తీసుకుంటన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో గురువారం జగన్, కెసిఆర్ నివాసానికి వెళ్లి ఆయనను పరామర్శించారు.
- Advertisement -