- Advertisement -
అమరావతి: జనసేన అధినేత పవన్ కల్యాణ్‌కు నిలకడలేదని సిపిఐ అగ్రనేత నారాయణ మండిపడ్డారు. నిన్నటి వరకు చేగువేరా దుస్తులు వేసుకున్న పవన్ కల్యాణ్… ఇప్పుడు సావర్కర్ దుస్తులు వేసుకునేందుకు సిద్ధమయ్యాడని చురకలంటించారు. పవన్ రేపు గాడ్సేలా తుపాకీ పట్టుకునేందుకూ కూడా సిద్ధమవుతాడని నారాయణ ధ్వజమెత్తారు. పవన్ ముందు కదలకుండా మూడు నిమిషాలు నిలబడగలిగితే ఆ తరువాత రాజకీయ స్థిరత్వం గురించి మాట్లాడుకోవచ్చన్నారు. పవన్ కల్యాణ్ ఒక దళారీల తయారయ్యాడని దుయ్యబట్టారు. టిడిపి-బిజెపి మధ్య పవన్ అనుసంధానం చేస్తున్నాడని, గతంలో ప్రత్యేక ప్యాకేజీని పవన్ పాచిపోయిన లడ్డూలతో పోల్చాడని, ఎన్డిఎలో ఎలా చేరుతున్నాడో చెప్పాలని పవన్‌ను నారాయణ నిలదీశారు. ప్రత్యేక హోదా ఇవ్వని బిజెపితో పవన్ ఎలా? అంటకాగుతారని ప్రశ్నించారు.
Also Read: గిన్నిస్ రికార్డు సాధించిన చనుబాల దాత(వైరల్ వీడియో)
- Advertisement -