Monday, December 23, 2024

కెసిఆర్‌ను నమ్మే పరిస్థితి లేదు : సిపిఐ నారాయణ

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీతో పొత్తుల విషయంలో సంప్రదింపులు చేస్తున్నామని సిపిఐ జాతీయ కార్యదర్శి నారాయణ వెల్లడించారు. సీట్ల విషయంలో ఇంకా ఎలాంటి స్పష్టత రాలేదని నారాయణ పేర్కొన్నారు. ఇండియా కూటమిలో భాగంగానే రాష్ట్రంలో పొత్తులుంటాయన్నారు. ప్రస్తుతం కెసిఆర్ ను నమ్మే పరిస్థితి లేదని ఆయన వెల్లడించారు. బిఆర్ఎస్, ఎంఐఎం వాళ్లు, బిజెపి వద్ద మోకరిల్లుతున్నారని నారాయణ ఆరోపించారు. బిఆర్ఎస్, ఎంఐఎం, బిజెపి అజెండా ఒక్కటేనని నారాయణ విమర్శించారు. సిపిఐ ఆధ్వర్యంలో తెలంగాణ సాయుధ పోరాట వజ్రోత్సవ వేడకలు నిర్వహించారు. అంబేడ్కర్ విగ్రహం నుంచి ట్యాంక్ బండ్ వరకు సిపిఐ నేతలు ర్యాలీ నిర్వహించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News