Friday, December 20, 2024

కేసీఆర్ ను గెలిపించడం కోసమే జగన్ నీళ్ల డ్రామా: నారాయణ

- Advertisement -
- Advertisement -

తెలంగాణలో కాంగ్రెస్ స్పష్టమైన మెజార్టీతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందని సిపిఐ సీనియర్ నేత నారాయణ అన్నారు. కేసీఆర్ ను గెలిపించడం కోసం ఎపి సిఎం జగన్ కుట్ర పన్నారని ఆయన ఆరోపించారు. నిన్న నాగార్జున సాగర్ డ్యాం వద్ద జరిగిన వివాదంపై శుక్రవారం నారాయణ మీడియా సమాశం నిర్వహించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నాగార్జున సాగర్ వద్ద జగన్ ప్రభుత్వం నాటకం ఆడిందని విమర్శించారు. ఓ వైపు తెలంగాణలో ఎన్నికల పోలింగ్ జరుగుతుంటే నీటిని అడ్డం పెట్టుకుని కేసీఆర్, జగన్ లు నాటకాలాడారని ఆయన ఆరోపించారు. తెలుగు ప్రజల మధ్య సెంటిమెంట్ ను రగిల్చి ఓట్లు దండుకునే కుట్ర చేశారని ఫైర్ అయ్యారు. ఎన్నికల్లో ఓడిపోతున్నామని తెలిసి.. బీఆర్ఎస్ క్యాంపు రాజకీయాలకు శ్రీకారం చుడుతోందని నారాయణ మండిపడ్డారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News