Thursday, January 23, 2025

కులానికి వ్యతిరేకంగా సిఎం మాట్లాడుతారా?: రామకృష్ణ

- Advertisement -
- Advertisement -

అమరావతి: అమరావతి ఏకైక రాజధానిగా ఉండాలని గతంలో అందరూ ఒప్పుకున్నారని సిపిఐ నేత రామకృష్ణ తెలిపారు. తుళ్లూరులో అమరావతి రైతులతో సిపిఐ నేత రామకృష్ణ ముఖాముఖి సమావేశం నిర్వహించారు. మాట మార్చిన వ్యక్తిగా జగన్ చరిత్రలో నిలిచిపోతారన్నారు. కులం పేరుతో దుష్ప్రచారాలు చేస్తున్నారని దుయ్యబట్టారు. సిఎం హోదాలో ఉన్న వ్యక్తి ఒక కులానికి వ్యతిరేకంగా మాట్లాడుతారా? అని ప్రశ్నించారు. జగన్ కంటే పెత్తందారు ఎవరైనా ఉన్నారా? అని రామకృష్ణ అడిగారు. ఇకనైనా కక్షసాధింపు రాజకీయాలు మానుకోవాలని సూచించారు. వైసిపి పాలనలో అన్ని రంగాలు నష్టపోయాయని ఆగ్రహం వ్యక్తం చేశారు.

Also Read: ఆలయ హుండీలో రూ. 100 కోట్ల చెక్.. భక్తుడి ఖాతాలో బ్యాలెన్స్ మాత్రం..

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News