Wednesday, January 22, 2025

సీతారాం ఏచూరి ఆరోగ్యం విషమం

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ: ఎయిమ్స్‌లో చికిత్స పొందుతున్న సిపి ఎం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉందని ఆ పార్టీ మంగళవా రం తెలిపింది. తీవ్ర శ్వాసకోశ సమస్యతో బాధపడుతున్న సీతారాంకు ఎయిమ్స్‌లోని ఐసియులో చికిత్స జరుగుతోందని, ఆయన వెంటిలేటర్‌పై ఉన్నారని సిపిఎం ఒక ప్రకటనలో తెలిపింది. ప్రతిపక్షానికి చెందిన ప్రముఖ నాయకులలో ఒకరైన సీతారాం పార్లమెంట్ లోపల, వెలుపల బిజెపిని తీవ్రంగా వ్యతిరేకించే నాయకుడిగా ప్రసిద్ధులు.

ఆయన 1984 నుంచి సిపిఎం కేంద్ర కమిటీలో సభ్యుడిగా 1992 నుంచి సిపి ఎం పాలిట్‌బ్యూ రో సభ్యుడిగా కొనసాగుతున్నారు. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీకి సీతారాం ఏచూరి అత్యంత సన్నిహితుడైన సలహాదారుడన్న పేరు కూడా రాజకీయ వర్గాలలో ఉంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News