Thursday, November 14, 2024

క్రూరమైన చట్టాలను రద్దు చేస్తాం: సిపిఎం

- Advertisement -
- Advertisement -

లోక్‌సభ ఎన్నికల కోసం సిపిఎం తన ఎన్నికల మేనిఫెస్టోను గురువారం విడుదల చేసింది. తాము అధికారంలోకి వస్తే యుఎపిఎ, మనీ లాండరింగ్ చట్టంతోసహా అన్ని క్రూర చట్టాలను రద్దు చేస్తామని సిపిఎం తన మేనిఫెస్టోలో వాగ్దానం చేసింది. బిజెపిని ఓడించి వామపోఆలను గెలిపించాలని, కేంద్రంలో ప్రత్యామ్నాయ లౌకికవాద ప్రభుత్వ ఏర్పాటుకు మద్దతివ్వాలని సిపిఎం ప్రజలకు విజ్ఞప్తి చేసింది. మతాన్ని రాజకీయాల నుంచి వేరు చేసే సిద్ధాంతానికి తాము కట్టుబడి ఉంటూ రాజీలేని పోరాటం చేస్తామని సిపిఎం వాగ్దానం చేసింది.

విద్వేష ప్రసంగాలకు, నేరాలకు వ్యతిరేకంగా చట్టం తీసుకురావడం కోసం తాము పోరాడతామని, 2019 నాటి పౌరసత్వ(సవరణ) చట్టం రద్దుకు తాము కట్టుబడి ఉన్నామని సిపిఎం పేర్కొంది. అత్యంత పంపన్నులపై పన్ను వేస్తామని, సాధారణ సంపద పన్ను, వారసత్వ పన్ను కోసం కొత్త చటాన్ని తీసుకువస్తామని సిపిఎం తెలిపింది. ఉద్యోగ భరోసా పథకం కోసం బడ్జెట్ కేటాయింపులు చేస్తామని, ఉపాధి హామీ పథకం వేతనాన్ని రెట్టింపు చేస్తామని, పట్టణ ప్రాంతాలలో ఉపాధి హామీ కోసం కొత్త చట్టాన్ని తీసుకువస్తామని సిపిఎం వాగ్దానం చేసింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News