Thursday, January 23, 2025

రాళ్ళదాడిలో గాయపడ్డ సిపిఎం కార్యకర్త మృతి

- Advertisement -
- Advertisement -

బోనకల్ ః మండల పరిధిలోని గోవిందాపురం (ఏ) గ్రామంలో గురువారం రాత్రి దుర్గమ్మ ఊరేగింపు సందర్బంగా కాంగ్రెస్, సిపిఎం పార్టీల మద్య జరిగిన పరస్పర రాళ్ల దాడిలో తీవ్రంగా గాయపడిన సిపిఎం కార్యకర్త ఎర్రబోయిన నాగేశ్వరావు (28) ఖమ్మంలో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ శనివారం ఉదయం మృతి చెందాడు. నాగేశ్వరావు మృతితో గ్రామంలో తీవ్ర ఉద్రిక్త పరిస్తితి ఏర్పడింది. నాగేశ్వరావు ఆరోగ్యం విషమించి ఆయన ఏక్షణమైన మృతి చెందవచ్చని అంచనా వేసిన పోలీసులు శుక్రవారం రాత్రికే భారీగా గ్రామానికి చేరుకొని గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు. ఐదుగురు ఎసిపి లు గ్రామంలో పోలీసులతో కవాతు నిర్వహించారు. ఖమ్మం పోస్టుమార్టం అనంతరం నాగేశ్వరావు మృతదేహాన్ని సాయంత్రం 3 గంటలకు గోవిందాపురంకు తరలించారు. ఈ సంధర్బంగా గ్రామానికి చెందిన సిపిఎం నాయకులు, కార్యకర్తలు భారీగా చేరుకొని నాగేశ్వరావు మృతదేహాన్ని చూసి కన్నీటిపర్యంతమయ్యారు. మృతునికి భార్య, కుమార్తు, కుమారుడు ఉన్నారు.

అంత్యక్రియలకు హాజరైన రాష్ట్రకార్యదర్శి తమ్మినేని వీరభద్రం….

నాగేశ్వరావు అంత్యక్రియలకు సీపీఎం రాష్ట్రకార్యదర్శి తమ్మినేని వీరభద్రం, నాయకులు పోతినేని సుదర్శనరావు, జిల్లా కార్యదర్శి నున్నా నాగేశ్వరావు, బండి రమేష్, పొన్నం వెంకటేశ్వరావు, చింతలచెర్వు కోటేశ్వరావు తదితరులు హాజరై నాగేశ్వరావు భౌతికకాయానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్బంగా మాట్లాడిన తమ్మినేని నాగేశ్వరావుపై దాడికి పాల్పడినవారు మిగలరని హెచ్చరించారు. నాగేశ్వరావు తన పెళ్లికి తమ్మినేని రావాలని పట్టుబడితే నాడు వచ్చానని కాని ఆయన కాంగ్రెస్ గూండాల చేతిలో హత్యకు గురై అంతిమయాత్రకు రావలసిరావటం దిగ్బ్రాంతికి గురిచేసిందన్నారు. ఎర్రజెండాను అణచివేయాలనే దమ్ము ఎవరికి లేదని ఒకవేళ అలా చేస్తే ఎర్రజెండా మరింత ఎరుపు ఎక్కుతుందన్నారు. నాగేశ్వరావు మృతదేహానికి నివాళులర్పించిన వారిలో భూక్యా వీరభద్రం, బొంతురాంబాబు, యనమదల విక్రం, బండి పద్మ, ఎర్రా శ్రీనివాసరావు, శీలం నరసింహారావు, పాలడుగు భాస్కర్, నవీన్‌రెడ్డి, దొండపాటి నాగేశ్వరావు, ఏడునూతల శ్రీనివాసరావులు నివాళులర్పించారు. నాగేశ్వరావు మదృతదేహానికి ఖమ్మం జిల్లా పరిషత్ చైర్మన్ లింగాల కమలరాజు, డీసీసీబీ చైర్మన్ కూరాకుల నాగభూషణం, మధిర ఏఎంసీ చైర్మన్ బందం శ్రీనివాసరావులు నివాళులర్పించారు

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News