- Advertisement -
తిరువనంతపురం: కేరళలోని 15 లోక్‌సభ స్నాలకు అధికార సిపిఎం మంగళవారం అభ్యర్థులను ప్రకటించింది. సిపిఎం ప్రకటించిన అభ్యర్థులలో మాజీ రాష్ట్ర మంత్రులు కెకె శైలజ, టిఎం థామన్ ఇసాక్ కూడా ఉన్నారు. వామపక్ష కూటమిలో భాగస్వామ్య పక్షాలైన సిపిఐ, కేరళ కాంగ్రెస్(ఎం) ఇప్పటికే తమ అభ్యర్థులను ప్రకటించాయి.
కీలక నియోజకవర్గాలలో దేవస్తాన్థం మంత్రి కె రాధాకృష్ణన్‌తోసహా నలుగురు సిట్టింగ్ ఎమ్మెల్యేలను సిపిఎం లోక్‌సభ అభ్యర్థులుగా ప్రకటించింది. ఎమ్మెల్యేగా గెలిచిన సినీ నటుడు ముకేష్‌తోపాటు వి జాయ్ కూడా లోక్‌సభకు పోటీ చేస్తున్నారు. సిట్టింగ్ ఎంపీలు ఎఎం ఆరిఫ్(లోక్‌సభ), ఎలమారమ్ కరీం(రాజ్యసభ) సిపిఎం లోక్‌సభ అభ్యర్థుల జాబితాలో ఉన్నారు. సిపిఎం రాష్ట్ర కార్యదర్శి ఎంవి గోవిందన్ మంగళవారం నాడిక్కడ విలేకరుల సమావేశంలో లోక్‌సభ అభ్యర్థులను ప్రకటించారు.
- Advertisement -