Wednesday, January 22, 2025

నేడు సిపిఎం అభ్యర్థుల జాబితా విడుదల

- Advertisement -
- Advertisement -

ఉదయం 9 గంటలకు తమ్మినేని ప్రెస్ మీట్

మన తెలంగాణ / హైదరాబాద్ : కాంగ్రెస్‌తో కటీఫ్ చేసుకున్న సిపిఎం పార్టీ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసేందుకే మొగ్గు చూపుతోంది. ఈ మేరకు నేడు ఆదివారం ఉదయం 9 గంటలకు సిపిఎం కార్యాలయంలో సిపిఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం తమ అభ్యర్థుల జాబితాను విడుదల చేయనున్నారు. అటు కాంగ్రెస్‌తో సిపిఐ పార్టీ పొత్తు కుదుర్చుకుని ఒక ఎంఎల్‌ఏ స్థానంలో పో టీకి అవకాశం కల్పించడంతో పాటు అధికారంలోకి వస్తే మరో శాసనమండలికి ఒక ఎంఎల్‌సి స్థానం కూడా ఇస్తామని టిపిసిసి చీఫ్ రేవంత్ చె ప్పడంతో అందుకు సిపిఐ తమ అంగీకారం తెలిపింది. అయితే సిపిఎం మాత్రం తాము కోరిన సీట్లు ఇవ్వాల్సిందేనని కాంగ్రెస్‌తో పట్టుబట్టడం తో సయోధ్య కుదరలేదని చెబుతున్నారు.

భద్రాచలం, మధిర అడిగితే సిట్టింగ్ స్థానాలు ఇవ్వలేమంటూ కాంగ్రెస్ నాయకులు చెప్పారని సిపిఎం చెబుతోంది. ఉమ్మడి ఎపిలో భద్రాచలంలో పది సార్లు ఎన్నికలు జరిగితే ఎనిమిది సార్లు సిపిఎం పార్టీనే గెలిచిందని సిపిఎం నేతలు గుర్తు చేస్తున్నారు. తమ ప్రతిపాదనల పట్ల కాంగ్రెస్ స్పందించక పోవడంతో పోటీ చేయాలని నిర్ణయించుకున్నట్లు చెబుతున్నారు. కాగా రాష్ట్రంలో తమకు బలం ఉన్న 24 సీట్లలో పోటీ చేయాలని తమ పార్టీ అభ్యర్థుల నుండి ప్రతిపాదనలు వచ్చాయని, ఈ క్రమంలో మొదటి విడతలో 17 స్థానాలను ప్రకటిస్తామని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం పేర్కొంటుండడం గమనార్హం.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News