Wednesday, January 22, 2025

ఎంఎస్ స్వామినాథన్‌కు సిపిఎం సంతాపం

- Advertisement -
- Advertisement -

హరిత విప్లవాన్ని కొనసాగించి ఆహార ఉత్పత్తిలో దేశాన్ని స్వయంసమృద్ధం చేశారు

మన తెలంగాణ / హైదరాబాద్ : ఎం.ఎస్ స్వామినాథన్ (98) మృతికి సిపిఐ(యం) తెలంగాణ రాష్ట్ర కమిటీ ప్రగాఢ సంతాపాన్ని ప్రకటిస్తున్న దని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం అన్నారు. వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నట్లు తెలిపారు. 1965 నుండి 1985వరకు భారతదేశంలో హరిత విప్లవాన్ని కొనసాగించి ఆహార ఉత్పత్తిలో దేశాన్ని స్వయంసమృద్ధం చేసిన శాస్త్రవేత్తగా స్వామినాథన్ పేరొందారన్నారు.

1965లో స్వామినాథన్ ఆధ్వర్యంలో హరిత విప్లవం ప్రారంభించి వరి, గోధుమల అధికోత్పత్తి వంగడాల వినియోగం ద్వారా విత్తనరంగంలో పెనుమార్పులు తెచ్చారన్నారు. భూసంస్కరణల అమలుకు కృషి చేశారని, ఆహారధాన్యాల లోటుతో ఉన్న దేశం 1985 నాటికి ఎగుమతుల దేశంగా మారిందన్నారు. ఆహారధాన్యాలు ఎగుమతులు చేసే స్థితికి చేరామని, హార్టికల్చర్ ఉత్పత్తులు కూడా ఎగుమతులు చేయగలిగామన్నారు. ఇలా వ్యవసాయ రంగంలో సమూల మార్పులు తీసుకొచ్చి దేశ వ్యవసాయ రంగాన్ని అభివృద్ధి పథంలో నడిపించాలని కృషి చేసిన శాస్త్రవేత్త స్వామినాథన్‌కు నివాళులు అర్పిస్తున్నామని తమ్మినేని వీరభద్రం అన్నారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News