- Advertisement -
తెలంగాణ పార్లమెంటరీ ఎన్నికల్లో ఒంటరిగా బరిలోకి దిగాలని సిపిఎం నిర్ణయించింది. ఈమేరకు భువనగిరినుంచి జహంగీర్ కు టికెట్ ఇస్తున్నట్లు ప్రకటించింది. మిగిలిన 16 మంది అభ్యర్థుల జాబితాను వీలైనంత త్వరలో వెల్లడిస్తామని ఆ పార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు వీరయ్య ప్రకటించారు.
అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ తో పొత్తు పెట్టుకున్న సిపిఐ మాత్రం లోక్ సభ ఎన్నికల్లోనూ ఈ పొత్తు కొనసాగుతుందని చెబుతోంది. ఇక బిజేపి, కాంగ్రెస్, బిఆర్ఎస్ పార్టీలు అభ్యర్థుల ఎంపికలో బిజీగా ఉన్నాయి. బిజేపి ఇప్పటికే 15 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించిన సంగతి తెలిసిందే.
- Advertisement -